Our Vision for Vishwa Shanti and Loka Kalyanam
విశ్వ శాంతి సంవర్ధిని (VSS) యొక్క ప్రధాన లక్ష్యం విశ్వ శాంతి మరియు లోక కళ్యాణం. 2018లో స్థాపించబడిన ఈ సంస్థ, భారతదేశంలో ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించేందుకు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సంస్కృత భాష, వేదాలు, భారతీయ జ్ఞాన సంప్రదాయాలు మరియు దేశీయ గోవుల సంరక్షణ కోసం పనిచేస్తోంది.
భూమి మరియు మానవులు సహా సమస్త జీవుల క్షేమం కోసం, వేదాలు మరియు శాస్త్రాలు ఏడు ముఖ్యమైన స్థంభాలను సూచించాయి. అవి — గోవులు, వేద పండితులు, వేదాలు, స్త్రీలు, సత్యం మాట్లాడేవారు, లోభరహితులు మరియు దానశీలులు.
సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము విశ్వ శాంతి
విశ్వ శాంతి కొరకు 7 స్తంభములు
చెప్పబడినాయి .
గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభీః
అలుభ్ధైః దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ
ఈ శ్లోకము లో చెప్పబడిన ఏడు ను సంపూర్ణ విశ్వమునకు ఆధార భూత స్తంభములు
1 ). గావః = ఆవులు యొక్క పంచకములు(గోక్షీరము గోదథి గోఘృతము గోమూత్రము గోమయము) వలన పంచభూతాత్మకమైన ఈ సమస్త విశ్వమునకు అనేక ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనములు కలిగి ఉన్నాయి .
అఅందువలన స్వదేశీ గోసంరక్షణ విశ్వ మానవాళి మనుగడకు అవశ్య కర్తవ్యము గా భావించి విశ్వ శాంతి సంవర్ధినీ ట్రస్ట్ ద్వారా ఉత్తర వాహిని ఐన వరుణా నది తీరమున (చౌథా పడావ్ ) రామేశ్వర మందిరమునకు చేరువలో చంద్రశేఖర గోశాల నడపబడు చున్నది .
విప్రుడు 2) వేదములు
విప్రుడు అనగా సత్కుల పుట్టిన బ్రాహ్మణ బాలుడు ఉపనయనాది నలబై సంస్కారములు ఉన్నత వేద శాస్త్రములు వేదాంగములు అధికాధిక బ్రహ్మ విద్యలు అధ్యయనము చేసినవారు విప్రులు.
ఇట్టి మహనీయులను గుర్తించి వారికి తులసీదళ సమర్పణ చేయుచున్నాము
యజ్ఞేశ్వర సాంగ వేద పాఠశాల లో
వేద శాస్త్రములు [గురుకులము] పద్ధతిలో నేర్పించుచున్నాము
1 పౌత్రాధ్యాపకులు
2 కుమారాధ్యాపకులు
3 విశేషము గా(లోపించి పోవుచున్న ) గ్రంధములను అధ్యయనము చేయువారికి ప్రోథ్సాహము అందించుట
సతి పతివ్రత > సతి గా జీవించుట కత్తి మీద సాము లాంటిది సహజము గానే. అటువంటిది కలియుగములో సతి గా జీవించుట ఎంత కష్టమో చెప్పనేల
సాధ్వీమణులు సతీమణులను యథాశక్తి గా ఆదరించి సహాయము అంద చేయుట
సత్యవాది > అబద్ధము ఆడని సత్యవాదులు
అలుబ్ధులు> ఉన్నంతలో సంతృప్తి చెందుతూ ఇతరులకు ఉపకారము చేయు స్వభావము కలవారు
దానశీలులు >తనకు ఉన్నంతలో (న్యాయార్జితములో) శక్తి వంచన లేకుండగా దాని ధర్మములు చేసెటివారు
సమస్త మానవాళికి ఆధార భూతమైన ఈ విశ్వ మంతయూ సప్త స్థంభాత్మక ( ధృవముల ) శక్తి మీద ఆధారపడి ఉన్నది .
‘ఆవులు విప్రులు వేదములు సతీమణులు సత్యవాదులు ఉదారగుణము కలవారు దాన గుణము కలవారు , అను ఏడు స్తంభములు విశ్వ శాంతి కొరకు రక్షించవలయును ఆ ప్రయత్నమే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
భవిష్యత్తులో ఇతోధికముగా గో సంరక్షణ
ఇతోధికముగా వేద పాఠశాల అభివృద్ధి
యతులకు[ దణ్డ సన్న్యాసులకు ] ఉచిత ఆవాస నివాసాది వ్యవస్థ
వృధ్ధాశ్రమము
అన్న దానము
విశ్వ శాంతి కొరకు యజ్ఞ యాగాదులు సమస్త వైదిక కార్యక్రమములు చేయుట చేయించుట
Vishwa Shanti Samvardhini (VSS) was founded in the year 2018 with the sacred vision of establishing Universal Peace and Global Welfare. Rooted deeply in the eternal wisdom of Sanatana Dharma, the organization is dedicated to nurturing Indian culture, Sanskrit language, Vedic knowledge, ancient Indian wisdom traditions, and the protection of indigenous cows, thereby fostering unity, harmony, and spiritual integrity across society.
For the welfare of the Earth, humanity, and all living beings, the Vedas and Shastras proclaim that the universe is sustained by seven sacred pillars:
Cows, Vedic Scholars, Vedas, Chaste Women, Truthful Souls, Selfless Individuals, and the Charitable.
These are beautifully expressed in the sacred verse:
“Gobhih Vipraishcha Vedaischa Satibhih Satyavadibhih
Alubdhaih Dānashīlaishcha Saptabhir Dhāryate Mahī”
— Meaning: The Earth is upheld by seven divine pillars — cows, learned Brahmins, Vedas, virtuous women, truthful people, contented souls, and the charitable.
The Seven Sacred Pillars of Universal Peace
1. Cows (Gavah):
The five sacred offerings of the cow — milk, curd, ghee, urine, and dung — provide immeasurable direct and indirect benefits to the five elements that constitute the universe. Recognizing this profound truth, VSS considers indigenous cow protection as a sacred duty essential for the survival and spiritual upliftment of humanity.
With this divine intent, Chandrashekhara Goshala is being lovingly maintained on the sacred banks of the north-flowing Varuna River, near Rameshwar Temple at Chautha Padaav, as a living embodiment of service to Mother Cow.
2. Vedic Scholars (Vipras) & 3. The Vedas:
True Vipras are those who, after sacred initiation, undergo deep spiritual training, mastering Vedas, Shastras, Vedangas, and higher spiritual sciences. Honoring such noble souls, VSS offers reverence and support through Tulasi offerings and dedicated service.
Through the Yajneshwara Sanga Veda Pathashala, Vedic education is imparted in the traditional Gurukula system, nurturing:
Senior teachers
Young student-scholars
Special encouragement for the study and revival of rare and endangered sacred texts
4. Chaste Women (Satis):
To live a life of chastity, purity, and righteousness is itself a path of divine sacrifice. Especially in this age, such spiritual living is profoundly challenging. VSS extends respect, care, and compassionate support to such virtuous women, recognizing them as sacred pillars of society.
5. Truthful Souls (Satyavadis):
Those who walk unwaveringly on the path of truth, never resorting to falsehood, are revered and honored.
6. Selfless and Content Souls (Alubdhah):
Individuals who remain content with what they have, free from greed, and dedicated to serving others selflessly are deeply respected.
7. Charitable Souls (Danashilah):
Those who earn righteously and share generously, performing charity without selfish intent, are celebrated as the spiritual backbone of civilization.
Our Sacred Mission
This entire universe rests upon the divine energy of these seven eternal pillars. Protecting, nurturing, and uplifting them for the sake of Universal Peace is the core mission of Vishwa Shanti Samvardhini (VSS).
Future Vision & Sacred Initiatives
With divine grace, VSS is committed to expanding its service through:
Extensive indigenous cow protection programs
Continuous development of Vedic education institutions
Free residential facilities for ascetics and renunciates
Establishment of old-age homes
Anna Daanam – sacred food distribution for the needy
Conducting Yagnas, Yagas, and Vedic rituals dedicated to Universal Peace
